PRANTIYA VAARTHA
Newspaper Banner
Date of Publish : 08 September 2026, 9:43 am Posted by : RAVINDHAR

రామలక్ష్మణ పల్లి గ్రామంలో స్కూల్ విద్యార్థులకు దుస్తుల పంపిణీ

(ప్రాంతీయ వార్త ప్రతినిధి సెప్టెంబర్ 07 )

గాంధారి మండలం: రామలక్ష్మణ పల్లి గ్రామంలో గ్రామపంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు దుస్తుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థుల సంక్షేమం, వారి విద్యాభివృద్ధికి గ్రామపంచాయతీ ఎల్లప్పుడూ సహకరిస్తుందని ఈ సందర్భంగా నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, గ్రామ సర్పంచ్ అనిల్, ఉప సర్పంచ్ కృష్ణమూర్తి, మాజీ సర్పంచ్ చందర్రావు, సిద్ధిరాములు, రావుజ హాజీ నవీన్ తదితరులు పాల్గొని విద్యార్థులకు దుస్తులు అందజేశారు.
గ్రామంలోని చిన్నారుల పట్ల గ్రామపంచాయతీ పాలకవర్గం చూపుతున్న శ్రద్ధ అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. విద్యార్థులు మంచి విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని కార్యక్రమంలో పాల్గొన్న వారు ఆకాంక్షించారు.