రాజంపేట పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

రాజంపేట జూలై 4 (ప్రాంతీయ వార్త)ప్రజలకు నాణ్యమైన, సమర్థవంతమైన పోలీసు సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర సూచించారు. రాజంపేట మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌ను శనివారం ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన, స్టేషన్‌లోని రికార్డులు, కేసు ఫైళ్లు, సీసీటీఎన్ఎస్ నమోదు, రిసెప్షన్, స్టోర్ రూమ్, బెల్ ఆఫ్ ఆర్మ్స్ తదితర విభాగాలను పరిశీలించారు. ఈ సందర్భంగా స్టేషన్‌లో రికార్డులు క్రమబద్ధంగా నిర్వహించడంతో పాటు సీసీటీఎన్ఎస్‌లో కేసుల వివరాలను సకాలంలో నమోదు చేసి ఎప్పటికప్పుడు నవీకరించాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్...