PRANTIYA VAARTHA
Newspaper Banner
Date of Publish : 16 July 2026, 2:45 pm Posted by : RAVINDHAR

మాకు బస్సు సౌకర్యం కలిపించండి

(ప్రాంతీయ వార్త ప్రతినిధి రవి జులై 16)

సోమవారం తండా దుర్గం గ్రామానికి బస్సు సౌకర్యాలు కల్పించాలి.సోమవారం తండా పెద్దమనుషులు కామారెడ్డి డిపో మేనేజర్ గారిని వినతి పత్రం సమర్పించడం జరిగింది….. నాయకులు మాట్లాడుతూ గత పదేళ్ల నుండి సోమవారం గ్రామానికి అట్లాగే దుర్గం గ్రామానికి బస్సు సౌకర్యాలు ఆపేశారు ఆ రోజు నుంచి ఇప్పటివరకు అక్కడ ఉన్న ప్రజలు మహిళలు పిల్లలు అనేక అవస్థలు పడతా ఉన్నారు ఆ రోజు నుంచి ఇప్పటివరకు డిపో మేనేజర్ ను అనేకసార్లు విన్నవించడం జరిగింది కానీ మా విన్నపమంతా పేడచేయున పెడతా ఉంటే ఏం చేయాలో తోచడం లేదు ఇప్పటికి ఎమ్మెల్యే ఎంపీలను కూడా వినతిపత్రం ఇచ్చాము అయినా మా ఊరి మీద ప్రేమ చూపడం కనుమరుగైపోయింది అందుకనే చివరిగా మరోసారి డిపో మేనేజర్ ను బస్సు ఏర్పాటు చేయడం కోసం చివరి వినతి పత్రం ఇస్తా ఉన్నాము ఇకనైనా స్పందించకపోతే ఆందోళన మార్గమే అని నిర్ణయించుకోవలసి వస్తుందని తాండ పెద్ద మనసులు డిపో మేనేజర్ ను వేడుకోవడం జరిగింది కావున దయ తలచి మా ఊరికి బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలని విన్నవించుకుంటున్నాము లేనిచో పెద్ద ఎత్తున బస్సు ఏర్పాటు కోసం కార్యచరణ తీసుకోవాల్సి వస్తుందని పత్రిక ముఖంగా హెచ్చరిస్తున్నాము ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నాయక్ తో పాటు కాంగ్రెస్ పార్టీ గాంధారి మండల ముఖ్య నాయకులు బ్రహ్మావత్ మోతి రామ్ నాయక్ గొల్లాడి తండా పెద్ద నాయకులు ఆమ్ గో తు మోతీరాం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు