PRANTIYA VAARTHA
Newspaper Banner
Date of Publish : 21 May 2026, 2:45 pm Posted by : RAVINDHAR

మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ విజయలక్ష్మి, రాష్ట్ర సలహాదారు వీహెచ్‌లకు ఎమ్మెల్యే శ్రీగణేష్ అభినందనలు

ప్రాంతీయ వార్త ప్రతినిధి మే 21

మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ విజయలక్ష్మి, రాష్ట్ర సలహాదారు వీహెచ్‌లకు ఎమ్మెల్యే శ్రీగణేష్ అభినందనలు*

కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ గురువారం తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్‌గా నేడు పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్న శ్రీమతి గద్వాల్ విజయలక్ష్మి గారికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీగణేష్ మాట్లాడుతూ, మహిళా సాధికారతే లక్ష్యంగా, బాధితులకు అండగా విజయలక్ష్మి గారి పదవీకాలం చరిత్రలో నిలిచిపోవాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మహిళల రక్షణ, సంక్షేమానికి కమిషన్ ద్వారా మరింత న్యాయం జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
అలాగే రాష్ట్ర సలహాదారు (బీసీ వెల్ఫేర్ & డెవలప్‌మెంట్)గా నియమితులైన ప్రజానాయకులు శ్రీ వి.హనుమంతరావు గారిని ఎమ్మెల్యే మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. బీసీల ఆశాజ్యోతిగా, వెనుకబడిన వర్గాల గొంతుకగా వి.హనుమంతరావు గారి అనుభవం రాష్ట్ర అభివృద్ధికి దిశానిర్దేశం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నేతలకు అభినందనలు తెలిపిన సమయంలో ఎమ్మెల్యే శ్రీగణేష్ వెంట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు