PRANTIYA VAARTHA
Newspaper Banner
Date of Publish : 18 June 2026, 4:48 pm Posted by : RAVINDHAR

మల్లికార్జున్ ను మర్యాదపూర్వకంగా కలిసి వారికి శుభాకాంక్షలు తెలియజేసి సన్మానించిన కామారెడ్డి జిల్లా టిపిటిఎఫ్ శ్రేణులు                              

ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 18                            
                                                                కామారెడ్డి జిల్లాకు  నూతనంగా విచ్చేసిన జిల్లా విద్యాశాఖ అధికారి ని ఈరోజు జిల్లా మరియు మండల బాధ్యులందరూ వారిని మర్యాదగాపూర్వకంగా కలిసి వారికి శుభాకాంక్షలు తెలిపి వారిని సన్మానించడం జరిగింది  అదేవిధంగా విద్యాశాఖలో  ఉన్న సమస్యలను పరిష్కరిస్తూ అదేవిధంగా జిల్లాలో కొనసాగుతున్న అక్రమ డిప్టేషన్లపై చర్య తీసుకోవాల్సిందిగా వారిని కోరడం జరిగింది అలానే అన్ని సంఘాలతో కలిపి కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేయాలని డీఈవో  ని కోరడం జరిగింది వారు స్పందించి అక్రమ డిప్రెషన్లకు సంబంధించిన వివరాలను  ఇవ్వాలని మరియు వాటిని తక్షణమే                        పరిష్కరిస్తానని వారు తెలియజేయడం జరిగింది  ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షులు చింతల లింగం, ప్రధాన కార్యదర్శి చింతల శ్రీనివాసరెడ్డి, ఉపాధ్యక్షురాలు నళిని దేవి, టి శ్రీనివాస్, జిల్లా కార్యదర్శులు  నరేందర్, గోపు శ్రీనివాస్, సోలేటి నారాయణ,                                     విజయ శ్రీ, రాజశేఖర్, సునీల్ కుమార్, ఫెడరేషన్ సీనియర్ బాధ్యులు ప్రకాష్,లింగంపేట బాధ్యులు  హరీష్,కామారెడ్డి మండల అధ్యక్షులు గ్యార బాబయ్య, ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్, సదాశివ నగర్ మండల అధ్యక్షులు మహమ్మద్ ఇలియాస్, ప్రధాన కార్యదర్శి   రమేష్ కుమార్ లు పాల్గొన్నారు