మండల స్థాయి అధికారుల సాక్షిగా తలకిందులుగా ఎగిరిన మువ్వన్నెల జెండా చౌదరి గూడ పంచాయతీలో జాతీయ జెండాకు ఘోర అవమానం జనగణమన పూర్తయ్యేదాకా సెల్యూట్ చేస్తూ నిర్లక్ష్యం
ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 02 రంగారెడ్డి జిల్లా చౌదర్ గూడా మండలం ( 02 మే 2026 )తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో అత్యంత ఘోరమైన, సిగ్గుచేటైన సంఘటన చోటుచేసుకుంది. దేశ గౌరవానికి, సార్వభౌమత్వానికి ప్రతీక అయిన జాతీయ జెండాను తలకిందులుగా ఎగురవేసి తీవ్రంగా అవమానించారు. రంగారెడ్డి జిల్లా చౌదరిగుడా గ్రామపంచాయతీ కార్యాలయంలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు స్థానికంగానే కాక రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. కళ్ళుండి చూడలేని అధికారులు.. ఏం జరిగిందంటే..? రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని చౌదరి...