మంజీరాను మింగేస్తున్న ఇసుక మాఫియా..?<br>సర్వేల ముసుగులో సాగుతున్న దోపిడీపై అనుమానాలు<br>కిందిస్థాయి అధికారులే కాదు.. ఉన్నతస్థాయి అండదండలున్నాయా..? ప్రజల్లో పెరుగుతున్న చర్చ

ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 7:తగ్గేలి మంజీరా సరిహద్దు ప్రాంతంలో జరుగుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న భారీ ఇసుక తవ్వకాల వ్యవహారం రోజురోజుకూ మరింత అనుమానాలకు తావిస్తోంది. అర్ధరాత్రి వేళల్లో భారీ జేసీబీలు, డోజర్లు నదీ గర్భంలో పనిచేస్తున్న దృశ్యాలు వెలుగులోకి వస్తున్నప్పటికీ, ఇప్పటి వరకు గట్టి చర్యలు కనిపించకపోవడం ప్రజలను విస్మయానికి గురిచేస్తోంది.మీడియాలో వరుస కథనాలు, స్థానికుల ఫిర్యాదులు, ప్రజాప్రతినిధుల వినతులు వచ్చినప్పటికీ పరిస్థితిలో మార్పు కనిపించకపోవడంతో "అసలు ఈ దందా వెనుక ఎవరి అండ ఉంది?" అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రతి సారి...