భూంపల్లి గ్రామంలో గ్రామదేవతలకు బోనాలు.<br>భక్తిశ్రద్ధలతో అమ్మవారికి నైవేద్యాలు సమర్పించిన గ్రామస్తులు. భూంపల్లి గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది
ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 04 కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలోని భూంపల్లి తదితర గ్రామంలో గ్రామదేవతలైన నల్లపోచమ్మ, పోలేరమ్మ. నాయకమ్మ, ముత్యాలమ్మ, బంగారు మైసమ్మ. ఐదు చేతుల పోచమ్మ. పిల్లి పోచమ్మ. అమ్మవార్లకు బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు. గ్రామ ప్రజలు సంప్రదాయబద్ధంగా అమ్మవార్లకు బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాలన్నీ ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడాయి.ప్రతి ఏడాది నిర్వహించే బోనాల పండుగ గ్రామ ప్రజల ఐక్యతకు, భక్తి భావనకు ప్రతీకగా నిలుస్తుందని గ్రామ పెద్దలు తెలిపారు. గ్రామ...