భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు,అప్రమత్తంగా ఉండాలి – రాజంపేట ఎస్సై ఆంజనేయులు

రాజంపేట జులై 29 ప్రాంతీయ వార్త రాజంపేట మండల కేంద్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాజంపేట ఎస్సై ఆంజనేయులు సూచించారు. వర్షాల కారణంగా ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాతవి, శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో నివసించకుండా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. విద్యుత్ స్తంభాలు, తెగిపోయిన విద్యుత్ తీగలు, ట్రాన్స్‌ఫార్మర్లకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. అలాగే పొంగిపొర్లుతున్న వాగులు, చెరువులు, కాలువలను ఎట్టి పరిస్థితుల్లోనూ...