PRANTIYA VAARTHA
Newspaper Banner
Date of Publish : 30 July 2026, 10:39 am Posted by : RAVINDHAR

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు,అప్రమత్తంగా ఉండాలి – రాజంపేట ఎస్సై ఆంజనేయులు

రాజంపేట జులై 29 ప్రాంతీయ వార్త

రాజంపేట మండల కేంద్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాజంపేట ఎస్సై ఆంజనేయులు సూచించారు. వర్షాల కారణంగా ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాతవి, శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో నివసించకుండా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. విద్యుత్ స్తంభాలు, తెగిపోయిన విద్యుత్ తీగలు, ట్రాన్స్‌ఫార్మర్లకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. అలాగే పొంగిపొర్లుతున్న వాగులు, చెరువులు, కాలువలను ఎట్టి పరిస్థితుల్లోనూ దాటేందుకు ప్రయత్నించవద్దని తెలిపారు. అత్యవసర పరిస్థితులు మినహా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని, చిన్నపిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారి ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఎవరైనా వరదనీటిలో లేదా ఇతర ప్రమాదకర పరిస్థితుల్లో చిక్కుకున్నట్లు గమనిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని కోరారు. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లలను చెరువులు, వాగులు, వరద నీటి ప్రాంతాలకు వెళ్లకుండా పర్యవేక్షించాలని ఎస్సై ఆంజనేయులు సూచించారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి పోలీసు శాఖకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.