ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 14
ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో నిన్న దురదృష్టవశాత్తు ఒక ఇంటి కి సెంట్రింగ్ కొడుతున్న కృష్ణకు పనిచేస్తున్న సమయంలో నిన్న సాయంత్రం అకస్మాత్తుగా మొదలైన గాలి దుమారం వలన 30 ఫీట్ల పైనుంచి కింద పడి గాయాలు అవ్వడం జరిగింది. ఈ విషయం తెలుసుకొని నిన్న స్థానిక ప్రైవేట్ హాస్పటల్ లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈరోజు భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు కమల ఐలన్న గారి ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లా కార్యదర్శి అబ్దుల్ రజాక్ ప్రైవేటు హాస్పిటల్ కి వెళ్లి కృష్ణను చూడడం జరిగింది మరియు కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పడం జరిగింది వారి వెంట గ్రామ అధ్యక్షులు లక్ష్మీనారాయణ, మరియు మల్లేష్, మహేష్, స్థానిక నాయకులు ఉన్నారు