PRANTIYA VAARTHA
Newspaper Banner
Date of Publish : 07 September 2026, 3:33 pm Posted by : RAVINDHAR

బుర్గుల్ గ్రామంలో నూతన SHG భవనానికి భూమిపూజ

(ప్రాంతీయ వార్త ప్రతినిధి రవి ఆగస్టు 07)

గాంధారి మండలం, బుర్గుల్: గ్రామంలోని మహిళా సంఘాల అభివృద్ధి, మహిళల ఆర్థిక స్వావలంబన లక్ష్యంగా నిర్మించనున్న నూతన SHG భవనానికి భూమిపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, గ్రామ పెద్దలు, గాంధారి మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులు, తిమ్మాపూర్ సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.
నూతనంగా నిర్మించనున్న SHG భవనం మహిళా స్వయం సహాయక సంఘాల కార్యకలాపాలకు ఎంతో ఉపయోగపడుతుందని, మహిళల ఆర్థికాభివృద్ధి మరియు స్వావలంబనకు ఇది దోహదపడుతుందని పలువురు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు, నాయకులు భవన నిర్మాణ పనులు త్వరగా పూర్తై మహిళలకు అందుబాటులోకి రావాలని కోరారు.