ఉమ్మడి నిజామాబాద్ జిల్లా : ఉమ్మడి జిల్లాలోని వేసవి సెలవుల కారణంగా పాఠశాలలు మూత పడగా ప్రైవెట్ స్కూల్ బస్సులు ఎక్కడికక్కడే ఉండిపోయాయి,మరి కొన్ని శుభాకార్యలకు,విహారాయత్రాలకు ప్రైవెట్ స్కూల్ బస్సులనూ అద్దెలకు ఇవ్వడంతో తాజాగా అవి కూడా పిట్నెస్ సమస్యలకు తలెత్తాయని *(A.I.S.B) ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు బైరాపూర్ రవీందర్ గౌడ్ అన్నారు*
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ నేల 15 నుంచి పాఠశాలలు పునః ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రైవెట్ స్కూల్ బస్సులకు సామర్థ్య పరీక్షలు నిర్వహించిన తర్వాతే (R.T.A) అధికారులు రోడ్డుపైకి అనుమతించాలి,చాలా రోజులగా కొన్ని బస్సులనూ నడపకపోవడంతో ప్రమాదలకు గురయ్యే అవకాశం ఉందని ఆయన అన్నారు.ఇకపై ప్రైవెట్ స్కూల్ కు చెందిన అర్హత సామర్థ్యం,డొక్కు బస్సులు 15 సంవత్సరాలు దాటి ఉన్న బస్సులు రోడ్డెకితే (R.T.A) అధికారులు వెంటనే ఆ బస్సులనూ సిజ్ చేయాలనీ ఆయన పేర్కొన్నారు.ఇంకో రెండు రోజులల్లో పాఠశాలలు పునః ప్రారంభం కానున్న నేపథ్యంలో (R.T.A) రవాణా శాఖ అధికారులు ప్రైవెట్ స్కూల్,కళాశాలల యాజమాన్యలతో బస్సుల పిట్నెస్ తప్పనిసారి వెంటనే చేయుంచుకొవాలని అవగహన కల్పించాలని ఆయన అధికారులను కోరారు లేని యెడల ఆ బస్సులను వెంటనే సిజ్ చేయాలని ఆయన (R.T.A) అధికారులు కోరారు…
*ఈ నిబంధనలు తప్పనిసరి*
ప్రైవెట్ స్కూల్ బస్సులకు తప్పనిసరిగా పసుపు రంగు వేయించడంతో పాటు నాలుగు వైపుల స్కూల్ పేరు ఫోన్ నెంబర్ కనిపించే విధంగా ఉండాలి.డ్రైవర్ కు ఐదు ఏళ్ల సీనియర్టీతో పాటు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.డ్రైవర్ వివరాలను జిల్లా రవాణా అధికారులకు తీయలియజేయాలి.బస్సు క్లినర్లు కొత్త వ్యక్తులు స్కూల్ బస్సులను నడుపారాదు.బస్సులలో తప్పనిసరిగా ఫస్ట్ ఏయిడ్ బాక్స్ తో పాటు శానిటైజర్ అందుబాటులో ఉంచాలి.బస్సులో డ్రైవర్ కు కనపడేలా ఇరువైపులా అద్దాలు,ఎమర్జెన్సీ డోర్ ఉంచాలి.బస్సుల డ్రైవర్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో హేల్త్ ధ్రువీకరణ పత్రాన్ని అందించాలి.అగ్ని ప్రమాదాలు సంబావించినప్పుడు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పైర్ ఎక్సిటింగ్ విషర్ లు ఉంచాలి లేని యెడల ఆ ప్రైవెట్ స్కూల్ బస్సులనూ వెంటనే (R.T.A) అధికారులు సిజ్ చేయాలని ఆయన కోరారు…