PRANTIYA VAARTHA
Newspaper Banner
Date of Publish : 19 May 2026, 12:14 pm Posted by : RAVINDAR

బాలికపై BRS సర్పంచ్ కొడుకు అత్యాచారం – KTR, హరీష్ రావు కళ్లు మూసుకున్నారా?

ప్రాంతీయ వార్త ప్రతినిధి మే 19

 

ఇదిగో చూడండి TRS నాయకుల ఆగడాలు. వికారాబాద్ జిల్లా యాలాల మండలంలో BRS సర్పంచ్ కొడుకు బి. రఘు (22) స్కూల్ నుంచి ఇంటి వద్ద వదిలేస్తానని నమ్మించి, 9వ తరగతి బాలికను కారులో ఎక్కించుకొని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడని పత్రికల్లో వచ్చింది.

*నా ప్రశ్నలు TRS నాయకులకు:*

1. *పోక్సో కేసు ఎందుకు ఆలస్యం?*

మైనర్ బాలికపై అత్యాచారం జరిగితే వెంటనే పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలి. 4 రోజుల తర్వాత తల్లిదండ్రులు ఫిర్యాదు చేసేదాకా పోలీసులు ఏం చేశారు? నిందితుడు BRS సర్పంచ్ కొడుకు కాబట్టే కేసు నీరుగార్చే ప్రయత్నం చేశారా? ఇప్పుడు “పరారీలో ఉన్నాడు” అంటున్నారు. BRS నేతల పిల్లలైతే పోలీసులు కూడా సలాం కొడతారా?

2. *KTR కు కనబడడం లేదా? హరీష్ రావుకు వినిపించడం లేదా?*

బండి సంజయ్ గారి కొడుకు విషయంలో రోజూ ట్వీట్లు పెట్టి, ప్రెస్‌మీట్లు పెట్టి రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన KTR గారికి, ఇప్పుడు సొంత పార్టీ సర్పంచ్ కొడుకు అఘాయిత్యం కనబడడం లేదా? హరీష్ రావు గారికి వినిపించడం లేదా?

అప్పుడు “తండ్రి నైతిక బాధ్యత వహించాలి” అన్న మీరే, ఇప్పుడు ఆ సర్పంచ్ రాజీనామా చేయాలని ఎందుకు అడగడం లేదు? BRS కండువా కప్పుకుంటే చట్టాలు వర్తించవా?

3. *పామూరులో పండుకున్న పెద్దాయన ఇటు చూడాలి*

10 ఏళ్లు రాష్ట్రాన్ని ఏలి, “బంగారు తెలంగాణ” అని చెప్పుకున్న KCR గారు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు? సిరిసిల్లలో బంధువు అఘాయిత్యం, ఇప్పుడు వికారాబాద్‌లో సర్పంచ్ కొడుకు అఘాయిత్యం. మీ పార్టీ నేతలు, వారి పిల్లలు ఆడబిడ్డల జోలికి పోతే ఒక్కరినైనా బహిష్కరించారా? ఒక్కరైనా పదవి వదులుకున్నారా? లేదు.

మీకు నీతులు చెప్పడం మాత్రమే వచ్చు, పాటించడం రాదు.

*ఇదేనా మీ డబుల్ స్టాండర్డ్?*

– ప్రతిపక్ష నాయకుల పిల్లలపై ఆరోపణ వస్తే: రోడ్లెక్కి ధర్నాలు, రాజీనామా డిమాండ్, పోస్టర్లు, యూట్యూబ్ ఛానళ్లలో తప్పుడు ప్రచారం.

– సొంత పార్టీ సర్పంచ్ కొడుకు మైనర్‌పై అత్యాచారం చేస్తే: మౌనం, పోలీసులతో మేనేజ్, నిందితుడికి పరారయ్యే ఛాన్స్.

*స్కూల్ యాజమాన్యం తప్పు కూడా ఉంది*

హెడ్‌మాస్టర్, టీచర్లు వాహన సౌకర్యం లేదని ముగ్గురు బాలికలను నిందితుడి కారులో పంపడం ఏమిటి? వారిపై కూడా నిర్లక్ష్యం కింద చర్యలు తీసుకోవాలి. కానీ అసలు దోషి BRS సర్పంచ్ కొడుకు.

*తెలంగాణ ప్రజలారా మేల్కోండి*

BRS 10 ఏళ్ల పాలనలో ఆడబిడ్డలకు రక్షణ లేదు. సర్పంచ్ కొడుకులే ఇలా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. కవిత లిక్కర్ కేసులో జైలుకు పోయినా పదవులు వదల్లేదు. ఇప్పుడు సర్పంచ్ కొడుకు పోక్సో కేసులో ఉన్నా పార్టీ నుంచి సస్పెండ్ చేయరు.