PRANTIYA VAARTHA
Newspaper Banner
Date of Publish : 27 July 2026, 2:49 am Posted by : RAVINDHAR

బహుజనుల రాజకీయ ఆకాంక్షలకు అంకురార్పణ చేసిన చక్రవర్తి చత్రపతి సాహూ మహారాజ్.బీఎస్పీ ఛీఫ్ జోన్ ఇంచార్జ్ అడ్వకేట్ నిషాని రామచంద్రం,

(ప్రాంతీయ వార్త రవి జూలై 26)

కామారెడ్డి:- బహుజనుల రాజకీయ ఆకాంక్షలకు అంకురార్పణ చేసిన చక్రవర్తి చత్రపతి సాహూ మహారాజ్ అని బీఎస్పీ ఛీఫ్ జోన్ ఇంచార్జ్ అడ్వకేట్ నిషాని రామచంద్రం అన్నారు. ఈ రోజు కామారెడ్డి జిల్లా కేంద్రం లో 124 వ రిజర్వేషన్ ల దినోత్సవం సందర్భంగా బీఎస్పీ జిల్లా అద్యక్షులు మాలోత్ హరిలాల్ నాయక్ అధ్యక్షతన  ఏర్పాటు చేసిన బహుజన రాజ్యాధికార సంకల్ప దివస్ సభ కి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో ముందుగా రిజర్వేషన్ల పితామహుడు చత్రపతి సాహూ మహారాజ్ గారి చిత్రపటానికి మరియూ బహుజన మహాపురుషులైన మహాత్మా ఫూలే, బాబాసాహేబ్ అంబేడ్కర్ , మాన్యశ్రీ కాన్షీరామ్ గార్ల చిత్రపటాలకు పూల మాల వేసి నివాళులు అర్పించి అనంతరం సభ లో పాల్గొన్నారు.

*అనగారిన కులాల రాజకీయ ఆకాంక్షలకు బీజం వేసిన రోజు జూలై 26*

అనగారిన కులాల రాజకీయ ఆకాంక్షలకు బీజం వేసిన రోజు జూలై 26 అని అడ్వకేట్ నిషాని రామచంద్రం అన్నారు. వేలాది సంవత్సరాలుగా బ్రాహ్మణీయ వ్యవస్థ వలన శూద్ర కులాలు అక్షరానికి , ఆస్తి కి , ఆయుధానికి , అధికారానికి, ఆత్మ గౌరవానికి దూరంగా జంతువుల కంటే నీచంగా చూడబడుతున్న సమాజం అభివృద్ధి చెందాలంటే వారికి రాజ్యం లో ప్రాతినిధ్యం కల్పించడం ఒక్కటే మార్గమని అందుకు తన రాజ్యం లో శూద్రులకు అనగా బ్రహ్మణేతరులకు యాబై శాతం రిజర్వేషన్లు కల్పించిన రిజర్వేషన్ల పితామహుడు చత్రపతి సాహూ మహారాజ్ అని కొనియాడారు. ఆనాడు ఆయన తన రాజ్యం లో విద్య ఉద్యోగ రంగాల్లో  రిజర్వేషన్లు కల్పించి శూద్రులకు ప్రాతినిధ్యం కల్పించకపోతే ఈ రోజు బహుజనుల బ్రతుకులు దీన స్థితిలో ఉండేవి అన్నారు. ఆనాడు ఆయన శూదృల అబ్యున్నతి కోసం తీసుకున్న నిర్ణయాలు చేసిన చట్టాలు ఈనాటి రాజ్యాంగం లో బాబాసాహేబ్ అంబేడ్కర్ పొందుపరిచి దేశ ప్రజలందరిని శాశ్వత బానిసత్వం నుండి విముక్తులను చేశారు అని అన్నారు. మహాత్మా ఫూలే ప్రారంభించిన పాఠశాలలను తిరిగి తెరిచి విద్య వ్యాప్తి కోసం కృషి చేశారు అని అన్నారు .
*బ్రహ్మణిజం మీద యుద్ధం ప్రకటించిన సాహూమహారాజ్*
బ్రహ్మణిజం మీద యుద్ధం ప్రకటించిన సాహూమహారాజ్ గారు బ్రాహ్మణ వాదం వలన సమాజం లో వివక్ష కు గరైన  క్రింది కులాల వారికి హస్టళ్లను స్థాపించారు. బ్రహ్మణవాదం వలన సమాజం లో బ్రాహ్మణేతరులను అనుచు వేయడానికి వారు తయారు చేసిన మనుధర్మ శాస్త్రం వలన సమాజం లో ఏర్పడ్డ అంటరాని తనం నిర్మూలన కోసం అస్పృశ్యుడి చేత హోటల్ పెట్టించారు. దేవదాసి వ్యవస్థ రద్దు కోసం , బాల్యవివాహాల రద్దు కోసం , వితంతువుల పునర్వివాహం కోసం , కోటి పద్దతి రద్దు కోసం , వతన్ దారి వ్యవస్థ రద్దు కోసం  వడ్డి వ్యాపార నిషేధం కోసం ఆయన అనేక చట్టాలను తయారు చేసిన గొప్ప చక్రవర్తి అని కొనియాడారు. ఈయన తీసుకున్న సాహసోపేత నిర్ణయాల వలన బ్రాహ్మణ వాదం ను కూకటి వేళ్ళతో పెకిలించబడింది అని అన్నారు. బాబాసాహేబ్ అంబేడ్కర్ ప్రారంభించిన మూక్ నాయక్ పత్రిక కి సహాయం చేస్తూ బాబాసాహేబ్ ని ప్రోత్సహించి పై చదువుల కోసం ఆర్ధిక సహాయం అందించారు అని అన్నారు.

*నేడు రిజర్వేషన్ లు  ప్రమాదంలో ఉన్నాయి*

సాహూ మహరాజ్ ప్రారంభించిన రిజర్వేషన్ ల ఉద్దేశం ను నేటికి మనువాద పాలకులు నెరవేర్చలేక రిజర్వేషన్లను తుంగలో తొక్కి బహుజనుల వెనుకబాటు తనానికి కారణం అవుతున్నారు అని నిషాని రామచంద్రం అన్నారు. దేశం రో రాజ్యాంగం అమలు అయిన తరువాత కూడ 43 ఏండ్ల పాటు బిసి లకు ఏ రంగం లో కూడ రిజర్వేషన్లు అమలు కాకుండా కాంగ్రెస్ బిజెపి కమ్యూనిస్టు పార్టీ లు అడ్డుకున్నాయి అని అన్నారు. నేడు బిసిల తో పాటు ఇతర కులాలు వెనుకబడి పోవడానికి కారణం కాంగ్రెస్ బిజెపి పార్టీ లే అని అన్నారు. రానున్న ఎన్నికల్లో మనువాద పార్టీ లను ఓడించి బీఎస్పీ ని గెలిపించి సాహూ మహారాజ్ ఆశయాలను నెరవేర్చాలని అన్నారు.

*సాహూ ఆశయాలను నెరవేర్చిన మాన్యవర్ కాన్షీరామ్*

ఉత్తర ప్రదేశ్ లో రాజ్యాధికారం సాగించడం ద్వారా సాహూ ఆశయాలను నెరవేర్చినారు. మాన్యవర్ కాన్షీరామ్ గారు భారత దేశం లో బహుజన ఉద్యమం ను దేశం నలుమూలల వ్యాప్తి చేస్తుంటే భారత ప్రభుత్వం దిగివచ్చి 1979 లో సాహూ పేరు మీద తపాల బిళ్ల ను సైతం విడుదల చేయక తప్పలేదు అని అన్నారు. 1895 లో బ్రిటీష్ మహారాణి సాహూ రాజు గారికి “*మహారాజు*” అనే బిరుదు ప్రదానం చేసింది అని అడ్వకేట్ నిషాని రామచంద్రం అన్నారు .

*ఇతర పార్టీ ల నుండి బీఎస్పీ లో చేరికలు*

జుక్కల్ అసెంబ్లీ ఇంచార్జి ఎర్ర గోపాల్ ఆద్వర్యం లో ఈ రోజు బహుజన్ సమాజ్ పార్టీ లో నిషాని రామచంద్రం సమక్షంలో సుమారు 30 మంది బీఎస్పీ లో చేరగా వారందరికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

*కామారెడ్డి డిక్లరేషన్ ను విస్మరించి బిసి లను మోసం చేసిన  కాంగ్రెస్ ప్రభుత్వం*

కామారెడ్డి డిక్లరేషన్ ను కాంగ్రెస్ విస్మరించి బిసిలను మోసం చేసిందని  అడ్వకేట్ నిషాని రామచంద్రం విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి వేదికగా బీసీల కోసం ఒక ప్రత్యేక డిక్లరేషన్ ప్రకటించింది. ఆ డిక్లరేషన్‌లో ప్రధానంగా
కుల గణన ఆధారంగా బీసీ రిజర్వేషన్లు
అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో కులగణన నిర్వహిస్తామని,
బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా విద్య, ఉద్యోగాల్లో బీసీ రిజర్వేషన్లు పెంచుతామని ప్రకటించింది.
స్థానిక సంస్థల్లో 42% బీసీ రిజర్వేషన్
పంచాయతీలు, మున్సిపాలిటీలలో బీసీలకు రిజర్వేషన్‌ను 23% నుంచి 42% కు పెంచుతామని కాంగ్రెస్ ప్రకటించి బిసి ల ఓట్లు వేసుకోని అధికారంలోకి వచ్చి బిసి లను మోసం చేసిందని అన్నారు .
ప్రభుత్వ కాంట్రాక్టుల్లో 42% రిజర్వేషన్  ప్రభుత్వ నిర్మాణ, నిర్వహణ పనుల కాంట్రాక్టుల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేస్తుందని అన్నారు
మహాత్మా జ్యోతిరావు ఫూలే BC సబ్-ప్లాన్
BC సబ్-ప్లాన్‌కు చట్టబద్ధ హోదా కల్పించి, ప్రతి సంవత్సరం రూ.20,000 కోట్ల చొప్పున, ఐదేళ్లలో మొత్తం రూ.1 లక్ష కోట్లు బీసీల అభివృద్ధికి ఖర్చు చేస్తామని ప్రకటించి నేటికి చేయడం లేదన్నారు
ప్రత్యేక MBC సంక్షేమ మంత్రిత్వ శాఖ
అత్యంత వెనుకబడిన వర్గాల (MBC) కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామని తెలిపింది.
కామారెడ్డి వేదికగా కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్, సంవత్సరానికి రూ.20 వేల కోట్ల నిధులు, రూ.10 లక్షల వడ్డీలేని రుణాలు, ప్రతి కులానికి కార్పొరేషన్లు, ప్రత్యేక మంత్రిత్వ శాఖ వంటి అనేక హామీలు ఇచ్చింది. ఇవన్నీ ప్రజల ముందే ప్రకటించి ప్రజలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నయ వంచన కు గురి చేస్తుంది అని అన్నారు . రానున్న ఎన్నికల్లో రేవంత్ రెడ్డి సర్కార్ కి ప్రజలు గుణపాఠం చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ ని అధికారంలోకి తీసుకురావాలని అందుకోసం ప్రతి కార్యకర్త సైనికుడి వలే పని చేయాలని అన్నారు. ఈ సమావేశంలో పార్లమెంట్ ఇంచార్జ్ రోహిదాస్ , జిల్లా ఉపాధ్యక్షుడు కొక్కొండ రాజేందర్ జుక్కల్ అసెంబ్లీ ఇంచార్జ్ లు ఎర్ర గోపాల్ , రాసిగొల్ల బాబు ఎల్లారెడ్డి అసెంబ్లీ అద్యక్షులు సాయి బాబు , కామారెడ్డి అద్యక్షులు నత్తి జీవన్ , జుక్కల్ అసెంబ్లీ అధ్యక్షులు బంగారి జైపాల్ తదితరులు పాల్గొన్నారు