బండి సంజయ్ ని పదవి నుంచి తొలగించాలి
యవాది పప్పు నాగేశ్వర్ రావు, అధికార దుర్వినియోగం ఆరోపిస్తూ, మంత్రి బండి సంజయ్‌ను మంత్రి పదవి నుంచి తొలగించాలని ప్రధానమంత్రి, రాష్ట్రపతికి లేఖ రాశారు. బాధితురాలికి న్యాయం జరిగేలా చూడాలని ఆయన కోరారు. బాధితురాలి తరపున హైకోర్టులో వాదనలు వినిపించిన న్యాయవాది పప్పు నాగేశ్వర్ రావు, నిందితుడికి బెయిల్ లభించకుండా విజయవంతంగా అడ్డుకున్నారని తెలిసింది. ఈ నేపథ్యంలో, అధికార పలుకుబడితో న్యాయవ్యవస్థను ప్రభావితం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. మంత్రి బండి సంజయ్ తన పదవిని దుర్వినియోగం చేస్తూ, కేసును పక్కదారి పట్టించే...