(ప్రాంతీయ వార్త ప్రతినిధి రవి, సెప్టెంబర్ 8: )
బంజారా యువతీ యువకులు శ్రావణమాసాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం నిర్వహించే విధంగానే ఈ సంవత్సరం కూడా 40 రోజుల పాటు ఉపవాస దీక్షలు చేపట్టి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
దీక్షల చివరి రోజు సందర్భంగా నేడు గాంధారి మండలంలోని రామలక్ష్మణపల్లి గ్రామ మందిర దైవ సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తిశ్రద్ధలతో ఉపవాస దీక్షను విరమించారు. ఈ సందర్భంగా బంజారా యువతీ యువకులు మాట్లాడుతూ శ్రావణమాసంలో ప్రతి సంవత్సరం భక్తితో ఉపవాస దీక్షలు చేపట్టి ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు.
కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అనిల్, ఉప సర్పంచ్, తాండ నాయకులు, గ్రామ పెద్దలు, కిరాణా షాప్ శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడు గణేష్ నాయక్, రవి కిషన్, హాజీ తదితరులు పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గ్రామంలో భక్తి శ్రద్ధలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.