PRANTIYA VAARTHA
Newspaper Banner
Date of Publish : 03 June 2026, 7:32 pm Posted by : RAVINDHAR

ప్రమాదవశాత్తు చెయ్యిని కోల్పోయిన యువకునికి అండగా నిలిచిన పైడి ఎల్లారెడ్డి..

ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 03

గడ్డి కట్టర్లో చేతుపడి నవ యువకుడు 32 సంవత్సరాల వయసు కలిగిన రాజారామ్ అనిల్ కుమార్ చేతు కోల్పోయిన విషయం బిజెపి లింగంపేట మండల అధ్యక్షులు బొల్లారం క్రాంతి కుమార్ గారు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జపాన్ శాస్త్రవేత్త డాక్టర్ పైడిల్లా రెడ్డి గారికి తెలియగానే వారు వెంటనే స్పందించి ఆ యువకుడిని హైదరాబాద్ కు పిలుచుకొని అతనికి బైక్ ని నడిపే విధంగా మరియు చిన్న చిన్న వస్తువులను పట్టుకునే విధంగా ఫైబర్ చేతిని అమర్చడం జరిగింది. దీనికి పూర్తి ఖర్చు పైడి ఎల్లారెడ్డి గారు భరించడం జరిగినది.
అలాగే ఆ కుటుంబానికి ఎప్పుడు అండగా ఉంటానని  చేతిని కోల్పోయినందుకు ఎలాంటి బాధపడద్దని అనిల్ కి ధైర్యం చెప్పాడు.
ఈ సందర్భంగా మండల అధ్యక్షులు బొల్లారం క్రాంతికుమార్ మాట్లాడుతూ పైడి ఎల్లారెడ్డి గారు మంచితనానికి మారుపేరు అని  కష్టం అని తెలిసి ఆయన దగ్గరికి వెళ్లిన ప్రతి ఒక్కరిని హక్కుల చేర్చుకుంటాడని ఇదివరకే లింగంపేటలో అకాల వర్షాల కారణంగా మండలంలో గృహాన్ని కోల్పోయిన వారికి ఆర్థిక సహాయాలు తినడానికి  నిత్యవసర వస్తువులను సుమరు  ఇదివరకే ఆయన 200కు పైగా గ్రామాల్లో వాటర్ ప్లాంట్ల నిర్మాణాన్ని  మరియు దేవాలయాల నిర్మాణం కోసం, ప్రభుత్వ పాఠశాలలో మరమ్మత్తులు మరియు విద్యార్థులకు కూర్చోవడానికి బెంచ్ ల వసతి, పేద విద్యార్థులకు తానే డబ్బులు కడుతూ ఉచితంగా విద్యా బోధన, తన జన్మించిన ఊరిలో దేవయి పల్లి గ్రామంలో సొంత డబ్బులతోనే ప్రభుత్వ బడిని నిర్మాణం ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన *ప్రజల దాహాన్ని తీర్చిన అపర భగీరధుడిగా, దానంలో  లేదనకుండా కాదనకుండా ఇచ్చేటువంటి ధానకర్ణుడిలా ఎల్లారెడ్డి ప్రజలకు ఎల్లారెడ్డి నియోజకవర్గం పేరుని తన పేరుగా పెట్టుకుని  సేవ చేయడానికి వచ్చిన నాయకుడని ఈ సందర్భంగా మండలాధ్యక్షుడు బొల్లారం క్రాంతి కుమార్ తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో బిజెపి మండల ప్రధాన కార్యదర్శులు ఆకుల విష్ణువర్ధన్ మార్గం సుభాష్ విజె వైయం నాయకులు దాసరి అనిల్ పట్టణ అధ్యక్షుడు నరేష్ భగవాన్, కిసాన్ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి రాజారం రమేష్, గణేష్, బిజెపి కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.