పెద్దమ్మ ఉత్సవాలలో గణనీయంగా బోనాలు

ప్రాంతీయ వార్త ప్రతినిధి మే 30రాజంపేట మండల కేంద్రంలోని వనదుర్గా శ్రీ పెద్దమ్మ దేవి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం అమ్మవారికి భక్తులు భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించారు. అలాగే పెద్దమ్మ–పెద్దిరాజుల కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారికి ఓడి బియ్యం సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. సాయంత్రం ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో భారీ ఎత్తున బోనాల ఊరేగింపు నిర్వహించి ఆలయానికి చేర్చారు. గ్రామంలో ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ముదిరాజ్ సంఘం పెద్దలు అమ్మవారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో...