ప్రాంతీయ వార్త ప్రతినిధి మే 20
తెలంగాణను నీళ్ల పేరుతో ఉద్యమం చేసి సాధించుకున్నాం అని చెప్పుకుంటూ పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ (BRS) పార్టీ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయడంలో ఘోరంగా విఫలమైంది.
మరోవైపు, ఎన్నికల ముందు అడ్డమైన హామీలు ఇచ్చి, అధికారంలోకి రాగానే పాలమూరు-రంగారెడ్డిని పూర్తి చేస్తామని నమ్మబలికిన కాంగ్రెస్ సర్కార్.. అధికారంలోకి వచ్చి 3 ఏండ్లు దాటుతున్నా కనీసం తట్టెడు మట్టి కూడా తీయకుండా ప్రజలను నట్టేట ముంచింది.
ఈ నేపథ్యంలో, పాలమూరు-రంగారెడ్డి పరివాహక ప్రాంత రైతాంగం మరియు ప్రజల హక్కుల కోసం తెలంగాణ రక్షణ సేన (TRS) పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు సింహగర్జన చేశారు.
ఇటీవలే నిర్వహించిన “పాలమూరు-రంగారెడ్డి సాధన సభ” ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వానికి కవిత గారు రాబోయే దసరా లోపు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులను పునఃప్రారంభించకపోతే కాంగ్రెస్ ప్రభుత్వ గుండెల్లో నిద్రపోయేలా భారీ ‘పాదయాత్ర’కు శ్రీకారం చుడతాం అంటు ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసారు.
కవితక్క దెబ్బకు కాంగ్రెస్ ప్రభుత్వంలో కదలిక వచ్చింది. సభ నిర్వహించిన కేవలం 10 రోజుల లోపే తెలంగాణ రక్షణ సేన ఒత్తిడికి దిగివచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులను, ముఖ్యంగా భూసేకరణ ప్రక్రియను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఇది తెలంగాణ రక్షణ సేన (TRS) పార్టీ సాధించిన చారిత్రాత్మక విజయం!