పంట అవశేషాల దగ్ధం… రైతులకు భారీ నష్టం* *▪️అడవి లింగాలలో అదుపుతప్పిన మంటలు* *▪️కాలిపోయిన కేబుల్ వైర్లు, మోటార్ సామాగ్రి* *▪️పర్యావరణానికి ముప్పు… నేల సారానికి నష్టం* *▪️అవశేషాలు తగలబెట్టొద్దంటూ అధికారుల హెచ్చరిక

    కామారెడ్డి/ప్రాంతీయ వార్త/ ఎల్లారెడ్డి: మే 27 ఎల్లారెడ్డి మండలంలోని అడవి లింగాల గ్రామంలో శనివారం పంట అవశేషాల దగ్ధం రైతులకు భారీ నష్టాన్ని మిగిల్చింది. వరి కోత అనంతరం పొలాల్లో మిగిలిన (కొయ్య కాళ్లు) పంట అవశేషాలకు నిప్పంటించడంతో మంటలు ఒక్కసారిగా వ్యాపించి సమీపంలోని రైతుల వ్యవసాయ సామాగ్రిని దగ్ధం చేశాయి. మంటల కారణంగా కేబుల్ వైర్లు, మోటార్ పైపులు, విద్యుత్ సామాగ్రి పూర్తిగా కాలిపోయినట్లు బాధిత రైతులు తెలిపారు. నిర్లక్ష్యంగా మంటలు పెట్టడం వల్ల తమకు తీవ్ర ఆర్థిక నష్టం...