నూతన ఎంపీడీవోని మర్యాదపూర్వకంగా కలిసిన లింగంపేట బిజెపి నాయకులు

ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 30 నూతనంగా ఆర్మూర్ నుండి వచ్చిన ఎంపీడీవో బ్రహ్మానందం గారిని మర్యాదపూర్వకంగా ఈరోజు బిజెపి నాయకులు కలవడం జరిగింది. పేద ప్రజలకు అండగా పార్టీలకు అతీతంగా విధి నిర్వహణ నిజాయితీగా నిర్వహించాలని బిజెపి నాయకులు ఎంపీడీవో గారిని కోరడం జరిగింది. విధి నిర్వహణలో ఎట్టి పరిస్థితుల్లో పేదవారికి మరియు నిజమైన న్యాయం ఎవరికైతే చేయాలో వారికే చేస్తారని ఎంపీడీవో గారు కూడా బిజెపి నాయకులతో తెలియజేయడం జరిగింది. అనంతరం నూతనంగా వచ్చిన ఎంపీడీవో గారిని శాలువాతో సన్మానం చేసి...