ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 30
నూతనంగా ఆర్మూర్ నుండి వచ్చిన ఎంపీడీవో బ్రహ్మానందం గారిని మర్యాదపూర్వకంగా ఈరోజు బిజెపి నాయకులు కలవడం జరిగింది.
పేద ప్రజలకు అండగా పార్టీలకు అతీతంగా విధి నిర్వహణ నిజాయితీగా నిర్వహించాలని బిజెపి నాయకులు ఎంపీడీవో గారిని కోరడం జరిగింది. విధి నిర్వహణలో ఎట్టి పరిస్థితుల్లో పేదవారికి మరియు నిజమైన న్యాయం ఎవరికైతే చేయాలో వారికే చేస్తారని ఎంపీడీవో గారు కూడా బిజెపి నాయకులతో తెలియజేయడం జరిగింది. అనంతరం నూతనంగా వచ్చిన ఎంపీడీవో గారిని శాలువాతో సన్మానం చేసి మిఠాయిని పంచడం జరిగింది.
ఈ కార్యక్రమంలో బిజెపి లింగంపేట మండల అధ్యక్షులు బొల్లారం క్రాంతికుమార్, మండల మాజీ ప్రధాన కార్యదర్శి శివయ్య గారి నవీన్ కుమార్, పట్టణ అధ్యక్షులు నరేష్ భగవాన్, కిసాన్ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి చింతకుంట రమేష్, బూత్ అధ్యక్షులు అశోక్ తదితరులు పాల్గొన్నారు