నీటిని పొదుపుగా వినియోగించుకోవాలి – మిషన్ భగీరథ గ్రిడ్ ఈఈ ఎస్. స్వప్న
కామారెడ్డి జిల్లా, అక్టోబర్ 26 (ప్రాంతీయ వార్త):సింగూరు జలాశయంలో నీటిమట్టం తగ్గుతున్న నేపథ్యంలో బల్క్ నీటి సరఫరాలో మార్పులు చేపట్టారు. ఎల్నినో ప్రభావంతో జలాశయంలో నీటి నిల్వలు తగ్గుముఖం పడుతున్నందున, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రోజు విడిచి రోజు నీటిని సరఫరా చేయాలని నిర్ణయించినట్లు బాన్సువాడ మిషన్ భగీరథ గ్రిడ్ కార్యనిర్వాహక ఇంజినీర్ ఎస్. స్వప్న సోమవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు.నియోజకవర్గాల వారీగా నీటి సరఫరాఈ నెల 28న ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాలకు, 29న బాన్సువాడ, బోధన్ నియోజకవర్గాలకు బల్క్ నీటిని సరఫరా...