(ప్రాంతీయ వార్త ప్రతినిధి రవి సెప్టెంబర్ 12 )
నల్లమడుగు: గ్రామంలో కొనసాగుతున్న SIR ప్రక్రియను పరిశీలించేందుకు ఆర్‌డీఓ గారు, ఎంఆర్‌వో గారు గ్రామానికి వచ్చారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించి, ప్రక్రియ ఎలా సాగుతోందో అధికారులను అడిగి తెలుసుకున్నారు.
SIR కార్యక్రమాన్ని ఎలాంటి లోపాలు లేకుండా సక్రమంగా నిర్వహించాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. గ్రామస్థులకు అవసరమైన సమాచారం అందిస్తూ, వారికి ఇబ్బందులు కలగకుండా ప్రక్రియను పూర్తి చేయాలని తెలిపారు.
ఈ సందర్భంగా సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.