తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలకు సన్నాహక సమావేశం,పోరాట చరిత్రను వక్రీకరించొద్దు – సీపీఎం ఎల్లారెడ్డి ఏరియా కార్యదర్శి మోతీరాం నాయక్

గాంధారి, ప్రాంతీయ వార్త: ఈనెల 17వ తేదీ వరకు నిర్వహించనున్న తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా గాంధారి మండల కేంద్రంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. మండల వ్యాప్తంగా ప్రతి శాఖ పరిధిలో తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.సమావేశాన్ని ఉద్దేశించి సీపీఎం పార్టీ ఎల్లారెడ్డి ఏరియా కార్యదర్శి మోతీరాం నాయక్ మాట్లాడుతూ, తెలంగాణ సాయుధ పోరాటం భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం సాగిన మహోన్నత ప్రజా పోరాటమని అన్నారు.ఆనాడు దొరల దోపిడీకి,...