PRANTIYA VAARTHA
Newspaper Banner
Date of Publish : 16 May 2026, 8:03 pm Posted by : RAVINDAR

తెలంగాణ తిరుపతి లో వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు

కామారెడ్డి ప్రాంతీయ వార్త ప్రతినిధి 27 మే

బాన్సువాడ నియోజకవర్గం బీర్కుర్ మండలం తిమ్మాపూర్ గ్రామ శివారులోని తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన ఆలయ ధర్మకర్త,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారు

కుటుంబ సమేతంగా స్వామి వారిని దర్శించుకున్న బాన్సువాడ RDO శ్రీ రవీందర్ రెడ్డి గారు

తిమ్మాపూర్ తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానానికి స్వామి వారి దర్శనం కొరకు వచ్చే భక్తులు దేవాలయం తరపున ఏర్పాటు చేసిన ఉచిత రవాణా సదుపాయం ఉపయోగించుకోవాలని తెలిపిన పోచారం గారు

దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులు, ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, వికలాంగులు,పిల్లలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కొండ కింద నుండి కొండ పైన దేవస్థానం వరకు దేవస్థానం తరపున ఉచిత వాహనం అందుబాటులో ఉంటుందని తెలిపారు

భక్తులకు ఈ విషయంలో ప్రాచుర్యం కల్పించడానికి ఈరోజు పోచారం గారు స్వయంగా వాహనాన్ని కొండ కింద నుండి కొండ పైకి, తిరిగి కొండ పై నుండి కింద వరకు నాలుగు ట్రిప్పులు వేసి భక్తులను చేరవేశారు

ఈ సందర్భంగా పోచారం గారు భక్తులతో మాట్లాడుతూ మీ తోటి భక్తులు ఈ ఉచిత రవాణా సదుపాయన్ని వినియోగించికోవాలని, ఇతరులకు ఈ సమాచారాన్ని చేరవేయాలని తెలిపారు

తమ సౌకర్యార్థం ఉచితంగా ఏర్పాటు చేసిన ఈ రవాణా సదుపాయనికి పోచారం గారికి, ఆలయ కమిటీకి భక్తులు ధన్యవాదాలు తెలిపారు

ఈ కార్యక్రమంలో బీర్కూర్ మండల నాయకులు, ప్రజాప్రతినిధులు తిమ్మాపూర్ ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు