ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 13
తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న బాణావత్ భాస్కర్ గారికి ₹2,50,000 ఆర్థిక సహాయం.
ప్రజల కష్టసుఖాల్లో తోడుగా నిలుస్తూ, అవసరమైన వేళల్లో వెంటనే స్పందించే నాయకత్వం ఎలా ఉండాలో మరోసారి నిరూపించారు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే శ్రీ మదన్ మోహన్ గారు.
గాంధారి మండలం,రాంపూర్ గడ్డ గ్రామానికి చెందిన బాణావత్ భాస్కర్ గారు అనారోగ్యంతో బాధపడుతూ అత్యవసర శస్త్రచికిత్స అవసరమని వైద్యులు సూచించారు. సాధారణ కుటుంబానికి చెందిన బాణావత్ భాస్కర్ గారి కుటుంబం ఇప్పటికే వైద్య ఖర్చులతో ఆర్థికంగా చితికిపోయి తీవ్ర ఆందోళనలో పడింది. కుటుంబ సభ్యులు ఆశ్రయించడానికి మార్గం లేక ఎమ్మెల్యే మదన్ మోహన్ గారిని సంప్రదించారు.
విషయం తెలిసిన వెంటనే స్పందించిన ఎమ్మెల్యే గారు, ఆలస్యం చేయకుండా ₹2,50,000 రూపాయల ఎల్.ఓ.సి ఆర్ధిక సహాయం చేయించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఆర్థిక సహాయం అందడంతో బాణావత్ భాస్కర్ గారి చికిత్సకు మార్గం సుగమమైంది.
ఇలాంటి క్లిష్ట సమయంలో మా కుటుంబానికి దేవుడిలా నిలిచారు అంటూ బాణావత్ భాస్కర్ గారి కుటంబ సభ్యులు భావోద్వేగంతో ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ ప్రజలు కూడా ఎమ్మెల్యే గారి తక్షణ స్పందనను ప్రశంసించారు.
ప్రజా సేవనే ధ్యేయంగా తీసుకుని, ప్రతి కుటుంబానికి భరోసాగా నిలుస్తున్న ఎమ్మెల్యే మదన్ మోహన్ గారి సేవా భావం నియోజకవర్గంలో విశేషంగా చర్చనీయం