PRANTIYA VAARTHA
Newspaper Banner
Date of Publish : 22 September 2026, 2:58 pm Posted by : RAVINDHAR

తిమ్మాపూర్‌లో ఉపాధి హామీ పనులను పరిశీలించిన డీఆర్డీఓ,

తిమ్మాపూర్, సెప్టెంబర్ 22 (ప్రాంతీయ వార్త):

గాంధారి మండలంలోని తిమ్మాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో నేడు జరుగుతున్న ఉపాధి హామీ పథకం పనులను డీఆర్డీఓ పీడీ దామోదర్ రెడ్డి, ఎంపీడీవో రాజేశ్వర్, ఏపీవో మధు పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలో కొనసాగుతున్న ఉపాధి హామీ పనుల పురోగతిని, పనుల నిర్వహణ తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో తిమ్మాపూర్ గ్రామ సర్పంచ్ బంగారు శంకర్, ఉపసర్పంచ్ సౌందర్య, వార్డు సభ్యులు ఉప్పల వై. రాజు, టీఏ నారాయణ, మేట్లు గోపాల్, మహేష్, సురేష్‌తో పాటు గ్రామ ఉపాధి కూలీలు పాల్గొన్నారు.