PRANTIYA VAARTHA
Newspaper Banner
Date of Publish : 15 May 2026, 8:49 pm Posted by : PRANTIYA VAARTHA

తప్పిపోయిన కొడుకుని అప్పగించిన పోలీసులు

తప్పిపోయిన తండ్రిని కుటుంబానికి అప్పజెప్పిన పోలీసులు.
కామారెడ్డి మే 16 ప్రాంతీయ వార్త

“24 ఏళ్ల కిందట ఇంటి నుంచి తప్పిపోయి, అదృశ్యమైన 65 ఏళ్ల వ్యక్తిని, ఆ కుటుంబానికి పోలీసులు చేర్చిన సంఘటన కామారెడ్డి పట్టణంలో శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జోగులాంబ గద్వాల జిల్లా పుటాన్ పల్లికి చెందిన 65 ఏళ్ల సత్యనారాయణ చారి తన స్వగ్రామం ఇంటి నుంచి తప్పిపోయి 24 ఏళ్లు అవుతుందని తెలిపారు. గత 24 ఏళ్లుగా ఎక్కడెక్కడో తిరుగుతూ.. కామారెడ్డికి చేరుకున్నాడని తెలిపారు. కామారెడ్డి పట్టణంలో పోలీసులు తనిఖీలో భాగంగా గురువారం రాత్రి కానిస్టేబుల్ అశోక్, హోంగార్డు రవిలు తనిఖీలు నిర్వహిస్తున్నారు. తనిఖీలలో భాగంగా సత్యనారాయణ చారి దగ్గర పూర్తి వివరాలు సేకరించారు. వెంటనే సమాచారాన్ని పట్టణ పోలీస్ స్టేషన్ కు తెలియజేశారు. వెనువెంటనే కామారెడ్డి పోలీసులు జోగులాంబ గద్వాల జిల్లా పోలీస్ స్టేషన్‌కు సమాచారాన్ని అందించారు. ఆ వెంటనే గద్వాల పోలీసులు వివరాలు తెలుసుకుని, వారి గ్రామంలో విచారణ నిర్వహించారు.

పుటాన్ పల్లి గ్రామంలో 24 ఏళ్ల కిందట సత్యనారాయణ చారి అనే వ్యక్తి తప్పిపోయి, అదృశ్యమైంది వాస్తవమని పోలీసుల విచారణలో తేలింది. విచారణలో సత్యనారాయణకు ఇద్దరు కుమారులు, పెద్ద కుమారుడు శివశంకర్, చిన్న కుమారుడు జ్ఞాన చారి(గణేష్). అని తెలుసుకున్నారు. వెంటనే కామారెడ్డి పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వగా వారు గద్వాల్ పోలీస్ స్టేషన్ సమాచారంతో నిర్ధారణ చేసుకొని తప్పిపోయిన విషయం నిజమేనని సత్యనారాయణ చారి అని గుర్తించి, ఆ వ్యక్తి కొడుకులను కామారెడ్డికి పంపించడం జరిగింది. శుక్రవారం కామారెడ్డి పట్టణ సీఐ నరహరి సమక్షంలో సత్యనారాయణని వారి కుమారులకు వారి తండ్రిని అప్పగించడం జరిగింది. ఈ సంఘటనలో పోలీస్ కానిస్టేబుల్ అశోక్, హోంగార్డు రవికి పిసి కమలాకర్ రెడ్డికి పట్టణ సీఐ అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా సత్యనారాయణ కుమారులు పట్టణ సీఐ