PRANTIYA VAARTHA
Newspaper Banner
Date of Publish : 16 May 2026, 9:28 am Posted by : RAVINDAR

జూన్ 2న రెండవ విడతఇందిరమ్మ గృహాలు ప్రతి గ్రామంలో ఇందిరమ్మకమిటీ మెంబర్లు పారదర్శికంగా పంపిణీ చేయాలి..  కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు- సితాయిపల్లి శీను 

 

కామారెడ్డి గాంధారి మే 17 ప్రాంతీయ వార్త

 కామారెడ్డి జిల్లా గాంధారి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సితాయి పల్లి శ్రీను, ఓ ప్రకటనలో మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం ఇందిరమ్మ గృహ పథకం ఇందులో భాగంగానే మొదటి విడత 90% గా పూర్తి అయ్యిందని రెండవ విడతగా జూన్ రెండవ తారీఖున నూతన ఇందిరమ్మ గృహాలు రాష్ట్రవ్యాప్తంగా మంజూరు అవుతున్నందున గ్రామ గ్రామాన ఇందిరమ్మ కమిటీ సభ్యులు గ్రామంలో నిరుపేదల ఆధ్వర్యంలో పేదలకు మంజూరు చేయాలని ఈసారి అవకతవకలు జరిగే ప్రసక్తే లేదు అని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ ఆదేశానుసారంగా నిజమైన నిరుపేదలకే ఇందిరమ్మ ఇల్లు దక్కాలని అందులో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వంలో కష్టపడ్డ ప్రతి ఒక్క నిరుపేదలకు ఇల్లు మంజూరవుతాయని ఇందులో ఎలాంటి సందేహం లేదని అన్నారు.