PRANTIYA VAARTHA
Newspaper Banner
Date of Publish : 29 July 2026, 7:48 pm Posted by : RAVINDHAR

జిల్లాస్థాయి అథ్లెటిక్ పోటీల్లో అండర్ 20 అండర్ 18 విభాగంలో సత్తా  చాటిన మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినిలు.

(ప్రాంతీయ వార్త ప్రతినిధి రవి జూలై 29 )

కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండల్. మర్కల్ గ్రామం నందు ఉన్న.తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల  చెందిన విద్యార్థులు ఈ నెల 27 న కామారెడ్డి జిల్లా కేంద్రం లోని ఇందిరాగాంధీ స్టేడియం  నందు జరిగిన. జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీల్లో. పాల్గొని తమ సత్తా చాటారు. ఇందులో భాగంగా జావేలిన్ త్రో పోటీ ఉమెన్స్ విభాగం లో ఎం. అమృత గోల్డ్ మెడల్  మరియు అండర్ -20 విభాగం లో బి. నవ్య గోల్డ్ మెడల్,అండర్ -18 విభాగం లో కే.స్వప్న సిల్వర్ మెడల్, ఎం.మహేశ్వరి బ్రాంజ్ మెడల్ సాధించారు. ఈ సందర్బంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి. శోభారాణి, వైస్ ప్రిన్సిపాల్ ఎస్. కృష్ణవేణి, ఫిజికల్ డైరెక్టర్ రమాదేవి తో పాటు అధ్యాపక బృందం విద్యార్థినీలను అభినందించారు.