చార్మినార్ చెంత కేటీఆర్ సందడి..*<br>నిమ్రా కేఫ్‌లో ఇరానీ చాయ్, ఉస్మానియా బిస్కెట్ల రుచి చూసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్<br>

ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 04 హైదరాబాద్ పాతబస్తీ సంస్కృతికి అద్దం పట్టే ఇరానీ చాయ్ రుచిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆస్వాదించారు. పాతబస్తీ పర్యటనకు వెళ్లిన ఆయన చార్మినార్‌కు ఆనుకుని ఉండే ప్రసిద్ధ 'నిమ్రా కేఫ్ అండ్ బేకరీ'ని గురువారం సందర్శించారు.ఈ సందర్భంగా కేటీఆర్ ట్విట్టర్ (ఎక్స్) వేదికగా స్పందిస్తూ.. "హైదరాబాద్ పాతబస్తీకి వెళ్లినప్పుడు అక్కడి ఇరానీ చాయ్ తాగకపోతే ఆ పర్యటనకు సంపూర్ణత్వమే ఉండదు. చార్మినార్ పక్కనే ఉన్న ప్రముఖ నిమ్రా కేఫ్‌ను సందర్శించి, ఇక్కడి రుచికరమైన ఉస్మానియా బిస్కెట్లు,...