PRANTIYA VAARTHA
Newspaper Banner
Date of Publish : 18 May 2026, 12:29 pm Posted by : RAVINDAR

గ్రామ అభివృద్ధిపై గంప గోవర్ధన్‌తో భేటీ

 

ప్రాంతీయ వార్త మే 18 కామారెడ్డి

 

కామారెడ్డి జిల్లా మాజీ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్‌ను సోమవారం ఆయన నివాసంలో ఎన్నారై బల్ల ఆంజనేయులు అనిల్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాజంపేట గ్రామ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, ప్రజలకు అవసరమైన సౌకర్యాలపై తమ అభిప్రాయాలను తెలియజేశారు. గ్రామ అభివృద్ధికి ఎల్లప్పుడూ సహకరిస్తానని గంప గోవర్ధన్ హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా జై తెలంగాణ, జై జై తెలంగాణ అంటూ నాయకత్వానికి మద్దతు తెలిపారు.