ప్రాంతీయ వార్త ప్రతినిధి మే 29.
జై గౌడ్ ఉద్యమం లింగంపెట్ మండల అధ్యక్షులుగా రాందాస్ రాజేశ్వర్ గౌడ్ గారిని జై గౌడ్ ఉద్యమం జాతీయ అధ్యక్షుడు వట్టికూటి రామారావు గౌడ్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గుండ్రాతి నారాయణ గౌడ్ గారి చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు.
అనంతరం రాజేశ్వర్ గౌడ్ గారు మాట్లాడుతూ లింగంపేట మండలంలోని గౌడ్స్ యొక్క సమస్యలను రాష్ట్ర స్థాయిలో తీసుకెళ్తూ వాటి పరిష్కారానికి తోడ్పడతనని, రాజకీయాలకు అతీతంగా గౌడ బిడ్డల అభ్యున్నతికి చేయూత అందిస్తానని చెప్పారు.
ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా జై గౌడ్ ఉద్యమం అధ్యక్షుడు మురళీ గౌడ్, ఉపాధ్యక్షులు శేఖర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ మరియు ఇతరులు పాల్గొన్నారు.