PRANTIYA VAARTHA
Newspaper Banner
Date of Publish : 10 July 2026, 2:57 am Posted by : RAVINDHAR

గెస్ట్ లెక్చరర్ లను రెన్యువల్ గా కొనసాగించాలని వారికి తగిన వేతనం చెల్లించాలని ప్రిన్సిపల్ కు వినతి పత్రం

(ప్రాంతీయ వార్త ప్రతినిధి రవి జూలై 09)

ప్రభుత్వ ఆర్ట్స్ సైన్స్ (ఎ), కళాశాల, కామారెడ్డి అతిథి అధ్యాపకుల జిల్లా అసోసియేషన్స్ ఆధ్వర్యంలో కళాశాల ప్రిన్సిపాల్ ప్రొ. కె. విజయ్ కుమార్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. తక్షణమే డిగ్రీ గెస్ట్ లెక్చరర్స్ లను రెన్యువల్ చేయడం &  అకాడమిక్ ఇయర్ మొత్తానికి కన్సాలిడేటెడ్ పే వేతనం చెల్లించడం గురించి విన్నవిస్తూ.. ప్రభుత్వ ఆర్ట్స్ & సైన్స్ కళాశాల (ఎ), కామారెడ్డి ప్రిన్సిపాల్ ద్వారా కమిషనరేట్ కార్యాలయం దృష్టికి తెలియజేసే అంశం గురించి చెప్పడం జరిగింది. కామారెడ్డి జిల్లా గెస్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్. నీరడి కార్తీక్, నూనె అంజనేయులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నోటిఫికేషన్స్ తో త్రీ మెన్ కమిటీ ద్వారా డెమో తీసుకున్న విధానాన్ని రద్దు చేసి, ప్రస్తుతం పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్లను రెన్యువల్ చేయాలి. పీరియడ్ (గంటల పని) & యూనివర్సిటీల అల్మానక్ ఆధారిత చెల్లింపు వేతన విధానాన్ని రద్దు చేసి, విద్యా సంవత్సరం మొత్తం UGC మరియు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేర నెలకు 42500 కన్సాలిడేటెడ్ పే వేతనం 12 నెలలు చెల్లించాలి అని కోరడం జరిగింది. ఇదే విధంగా తెలంగాణ రాష్రంల్లోని 33 జిల్లాల అతిథి అధ్యాపకుల జిల్లాలా అసోసియేషన్స్ సభ్యులు కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాలని పిలుపునియ్యడం జరిగింది. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా అతిథి అధ్యాపకుల అధ్యక్షులు డా. నీరడి కార్తిక్, ప్రధాన కార్యదర్శి నూనె ఆంజనేయులు, ఉపాధ్యక్షులు శ్రీలత, సంయుక్త కార్యదర్శి రమణ, సలహా దారులు రాంప్రసాద్, అనిల్ కృష్ణ మరియు సభ్యులు డాక్టర్ బాలాజీ, డాక్టర్ రవికుమార్, సరిత, పవన్, వెన్నెల వర్షిని, మహేష్, రమేష్, శ్రీనివాస్, ప్రభాకర్ గౌడ్, నేనావత్ రవి, శ్రీకాంత్ పాల్గొన్నారు.