గుజ్జుల్ డ్యాం పనులు ప్రారంభం.
ప్రాంతీయ వార్త ప్రతినిధి మే 19 గాంధారి మండలం గుజ్జుల్ తండా గ్రామ పంచాయతీ పరిధిలోని గుజ్జుల్ డ్యాం వద్ద ఇటీవల ఏర్పడిన సమస్యపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు మరియు గ్రామ పెద్దలు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించి డ్యాం రిపేర్ పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.