PRANTIYA VAARTHA
Newspaper Banner
Date of Publish : 01 June 2026, 7:12 pm Posted by : RAVINDHAR

గాంధారి మండలం మాతుసంఘం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు సామూహిక గృహ ప్రవేశం

ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 01
మాతుసంఘం గ్రామంలో తెలంగాణా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన కార్యక్రమంలో భాగంగా ఇందిరమ్మ ఇళ్లు గృహ ప్రవేశం చేయడం జరిగింది. లబ్ధిదారులు మహమ్మద్ సలీమా బేగం. కుమ్మరి కవిత. మహమ్మద్ ముస్తఫా. గృహప్రవేశం చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో మాతుసంఘం సర్పంచ్ మాదోజీ వందన-బల్వంత్ రావు గారు ఉప సర్పంచ్ బుచ్చి స్వామి గ్రామపంచాయతీ పాలక వర్గ సభ్యులు ఇంద్రాబాయి నీరడీ బాల్రాజు చిర్ర సంతోష్ సెక్రటరీ శ్రీనివాస్ గారు కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు మాదోజి శంకర్ రావు ఇందిరమ్మ కమిటీ అధ్యక్షులు కల్లెంపేట సాయిలు పట్లోళ్ల రాంచందర్ రావు గారు మరియు కాంగ్రెస్ పార్టీ సభ్యులు పాల్గొన్నారు మాతు సంగం గ్రామానికి మొదటి విడతలో భాగంగా ఇల్లు మంజూరు చేసినందుకు గాను ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారికి మరియు ఎల్లారెడ్డి నియోజకవర్గ గౌరవ ఎంఎల్ఏ మదన్ మోహన్ రావు గారికి గ్రామ ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు