PRANTIYA VAARTHA
Newspaper Banner
Date of Publish : 18 June 2026, 5:03 pm Posted by : RAVINDHAR

యువజన కాంగ్రెస్ నూతన <br>అధ్యక్షులు గా ఏకగ్రీవం

ఎల్లారెడ్డి నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సర్దార్ నాయక్ అధ్యక్షతన గాంధారి మండలంలోని గ్రామా కమిటీ  ఎన్నుకొన్న  గాంధారి మండల యూత్  అధ్యక్షులు చాకలి రాజు గారు .. ఈ  సందర్భంగా చాకలి రాజు మాట్లాడుతూ, యూత్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను గ్రామ స్థాయికి తీసుకెళ్లడంలో యువజన కాంగ్రెస్ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. నూతనంగా నియమితులైన అధ్యక్షులు యువత సమస్యల పరిష్కారానికి కృషి చేయడంతో పాటు పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు.
యువతను సంఘటితం చేసి ప్రజా సమస్యలపై పోరాడుతూ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, రాబోయే రోజుల్లో పార్టీ విజయానికి ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని నాయకులు పిలుపునిచ్చారు.
నూతన యువ అధ్యక్షులు పార్టీ తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని, పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తామని తెలిపారు.