గర్భిణి కి సకాలంలో ఏ నెగిటివ్ రక్తం అందజేత<br>ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు
ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 14కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో రక్తహీనతతో బాధపడుతున్న గౌతమి (28) గర్భిణీకి ఏ నెగిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావాల్సిన రక్తాన్ని ఎల్లారెడ్డికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు గోష్కే నాగరాజు మానవతా దృక్పథంతో స్పందించి రక్తదానం చేయడం జరిగిందని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు తెలియజేశారు.ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా యువత రక్తదానానికి ముందుకు రావాలని ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 12 కోట్ల యూనిట్ల రక్తం...