గండివేట్ మతసామరస్యానికి ప్రతీకగా నిలిచిన ముస్లిం సోదరులు
గండిపేట, సెప్టెంబర్ 21 (ప్రాంతీయ వార్త ప్రతినిధి రవి):కులమతాలకు అతీతంగా మానవత్వమే పరమావధిగా భావిస్తూ గండిపేట గ్రామంలో ముస్లిం సోదరులు అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొని మతసామరస్యానికి ప్రతీకగా నిలిచారు. గత వారం రోజులుగా ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో 11 రోజుల పాటు నిర్వహిస్తున్న నిత్యాన్నప్రసాద కార్యక్రమంలో భాగంగా సోమవారం ముస్లిం సోదరులు దాతలుగా ముందుకొచ్చి స్వయంగా వంటలు తయారు చేసి, అన్నప్రసాద పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.