కేసీఆర్‌ గురువు పున్నారెడ్డి కన్నుమూత

ప్రాంతీయ వార్త ప్రతినిధి మే 27 _దుబ్బాక, మే 26: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిన్ననాటి గురువు నక్కల పున్నారెడ్డి (90) మంగళవారం కన్నుమూశారు. ఆయన కొన్నేండ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు._ఈ క్రమంలోనే ఆయన స్వగ్రామైన సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్దగుండవెల్లిలో మంగళవారం ఉదయం పున్నారెడ్డి తుదిశ్వాస విడిచినట్టు కుటుంబీకులు తెలిపారు._దుబ్బాక ప్రభుత్వ పాఠశాలలో కేసీఆర్‌ విద్యనభ్యసించే సమయంలో పున్నారెడ్డి తెలుగు సబ్జెక్టు బోధించేవారు. పున్నారెడ్డి సతీమణి బాలమణి కూడా మూడునెలల కిందట చనిపోయారు. ప్రస్తుతం పున్నారెడ్డి కుమారుడు దామోదర్‌రెడ్డి స్వగ్రామంలో...