కుట్ర రాజకీయాలే ఆరోపణల వెనుక బేస్ట్ చంద్ర.. ఆరోపణలు రుజువైతే శిక్షకు సిద్ధం

ప్రాంతీయ వార్త మే 20 కామారెడ్డి తన రాజకీయ ఎదుగుదలను అడ్డుకునేందుకే కొందరు కావాలనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని రాజంపేట కాంగ్రెస్ మాజీ టౌన్ ప్రెసిడెంట్ బెస్ట్ చంద్రం ఆరోపించారు. మంగళవారం తనపై వచ్చిన వార్తలను ఖండిస్తూ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తనపై వ్యక్తిగత వైరం పెట్టుకున్న కొందరు వ్యక్తులు బాధిత మహిళకు తప్పుడు సూచనలు ఇస్తూ తన ప్రతిష్టను దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, ఆరోపణలు నిజమని నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధంగా ఉంటానని...