PRANTIYA VAARTHA
Newspaper Banner
Date of Publish : 20 May 2026, 9:35 am Posted by : RAVINDHAR

కుట్ర రాజకీయాలే ఆరోపణల వెనుక బేస్ట్ చంద్ర.. ఆరోపణలు రుజువైతే శిక్షకు సిద్ధం

ప్రాంతీయ వార్త మే 20 కామారెడ్డి

తన రాజకీయ ఎదుగుదలను అడ్డుకునేందుకే కొందరు కావాలనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని రాజంపేట కాంగ్రెస్ మాజీ టౌన్ ప్రెసిడెంట్ బెస్ట్ చంద్రం ఆరోపించారు. మంగళవారం తనపై వచ్చిన వార్తలను ఖండిస్తూ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తనపై వ్యక్తిగత వైరం పెట్టుకున్న కొందరు వ్యక్తులు బాధిత మహిళకు తప్పుడు సూచనలు ఇస్తూ తన ప్రతిష్టను దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, ఆరోపణలు నిజమని నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధంగా ఉంటానని స్పష్టం చేశారు. గతంలో కూడా ఇదే మహిళ పలువురు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులపై ఇలాంటి ఆరోపణలు చేసిన సందర్భాలు ఉన్నాయని, వాటికి సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని తెలిపారు. ఈ వ్యవహారంలో పార్టీ అధిష్టానం, పోలీసుల విచారణకు పూర్తి సహకారం అందిస్తానని పేర్కొన్నారు. తన రాజకీయ భవిష్యత్తును దెబ్బతీయడమే లక్ష్యంగా కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని బెస్ట్ చంద్రం ఆరోపించారు.