కాలభైరవ స్వామి దేవస్థాన అభివృద్ధికి ఎమ్మెల్యే మదన్ మోహన్ ప్రత్యేక దృష్టి
దేవస్థాన అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే కామారెడ్డి మే 16 ప్రాంతీయ వార్త : ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసానికి కేంద్రబిందువుగా నిలిచిన కాలభైరవ స్వామి దేవస్థాన అభివృద్ధిపై ఎమ్మెల్యే మదన్ మోహన్ ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పన, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలపై ఆలయ కమిటీ సభ్యులతో సమగ్రంగా చర్చించారు. ఈ సమావేశంలో దేవస్థాన చైర్మన్, టెంపుల్ కమిటీ డైరెక్టర్లు, రామారెడ్డి సర్పంచ్, ఇస్సనపల్లి సర్పంచ్ మరియు ఇతర ప్రజాప్రతినిధులు...