PRANTIYA VAARTHA
Newspaper Banner
Date of Publish : 10 September 2026, 6:05 pm Posted by : RAVINDHAR

ఐలమ్మ విగ్రహాలు జాతి ఐక్యతకు చిహ్నాలు

(ప్రాంతీయ వార్త ప్రతినిధి రవి సెప్టెంబర్ 10)

జువ్వాడి: వీరనారి చిట్యాల చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి సందర్భంగా జువ్వాడి గ్రామంలో నాయకులు, యువకులు, రజక సంఘం నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా జువ్వాడి కాంటెస్ట్ సర్పంచ్ మచ్చర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ, వీరనారి చాకలి ఐలమ్మ చేసిన త్యాగాలు, ఆమె పోరాట స్ఫూర్తిని నేటి తరానికి తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు.
చాకలి ఐలమ్మ తన జీవితాంతం అన్యాయాలకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడి సమాజానికి ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. ఆమె ఆశయాలు, పోరాట పటిమ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని తెలిపారు.
ప్రతి గ్రామంలో చాకలి ఐలమ్మ విగ్రహాలను ఏర్పాటు చేయడం ద్వారా రజకుల ఐక్యతను మరింత బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. చాకలి ఐలమ్మ విగ్రహాలు కేవలం స్మారక చిహ్నాలు మాత్రమే కాకుండా జాతి ఐక్యతకు ప్రతీకలుగా నిలుస్తాయని అన్నారు.
రజకులు అందరూ ఐక్యంగా ముందుకు సాగుతూ తమ హక్కుల సాధన కోసం చైతన్యంతో ఉద్యమించాలని కోరారు. సమాజ అభివృద్ధి, హక్కుల పరిరక్షణ కోసం యువత ముందుండి పనిచేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, యువకులు, రజక సంఘం నాయకులు పాల్గొని వీరనారి చాకలి ఐలమ్మకు ఘనంగా నివాళులు అర్పించారు.