ఏడాది పూర్తయిన సందర్భంగా పోరాటాన్ని గుర్తు చేసుకుంటున్న పరిశోధకులు ఉపాధి హామీ కూలి నుంచి గవర్నర్ చేతుల మీదుగా పీహెచ్‌డీ పట్టా వరకు.
(ప్రతీయ వార్త ప్రతినిధి రవి జులై 17) నిరుపేద కుటుంబంలో జన్మించి, జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని, ఉపాధి హామీ కూలిగా పనిచేసిన స్థాయి నుంచి రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా పీహెచ్‌డీ పట్టా అందుకునే స్థాయికి ఎదిగిన డాక్టర్ పీబీ సత్యం ప్రస్థానం పలువురికి ఆదర్శంగా నిలుస్తోంది. వ్యక్తిగత విజయంతో పాటు, తెలంగాణ యూనివర్సిటీలో పీహెచ్‌డీ పూర్తి చేసిన వందలాది మంది పరిశోధకులకు న్యాయం జరిగేలా ఉద్యమించి రెండో కన్వొకేషన్ నిర్వహణకు మార్గం సుగమం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.కష్టాల మధ్య...