PRANTIYA VAARTHA
Newspaper Banner
Date of Publish : 19 May 2026, 4:42 am Posted by : RAVINDAR

ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ లో శాంతి కమిటీ సమావేశం

 

ప్రాంతీయ వార్త, మే 18 ఎల్లారెడ్డి

పోలీస్ స్టేషన్లో డీఎస్పీ ఎస్. శ్రీనివాస రావు ఆధ్వర్యంలో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాజా రెడ్డి సీఐ ఎల్లారెడ్డి, రాజు ఎస్సై ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన ప్రముఖులు, సంఘ నాయకులు పాల్గొన్నారు. పట్టణంలో శాంతి భద్రతలు కాపాడడం, సామరస్య వాతావరణాన్ని కొనసాగించడం, రాబోయే పండుగలు, కార్యక్రమాలు ప్రశాంతంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని తెలిపారు.