PRANTIYA VAARTHA
Newspaper Banner
Date of Publish : 10 June 2026, 5:01 pm Posted by : RAVINDHAR

ఎల్లారెడ్డి నియోజకవర్గం ఎమ్మెల్యే. క్యాంప్ ఆఫీస్ లో “TPCC ఆధ్వర్యంలో SIRపై బీఎల్ఏలకు ప్రత్యేక శిక్షణ

ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 10

ఎల్లారెడ్డి నియోజకవర్గం ఎమ్మెల్యే. క్యాంప్ ఆఫీస్ లో *”TPCC ఆధ్వర్యంలో SIRపై బీఎల్ఏలకు ప్రత్యేక శిక్షణ – ఓటర్ల జాబితా సవరణలో అప్రమత్తంగా ఉండాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే గౌరవ మదన్మోహన్ రావు గారి ఆదేశానుసారం.డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ సూచన”
ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో బీఎల్ఏల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. ప్రతి బీఎల్ఏ తన బూత్ పరిధిలోని ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ, కొత్త ఓటర్ల నమోదు, చిరునామా మార్పులు, తప్పుల సవరణలు, అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేలా కృషి చేయాలని సూచించారు.
రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి బలమైన బూత్ వ్యవస్థే పునాదిగా నిలుస్తుందని పేర్కొంటూ, గ్రామ స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయడానికి ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
శిక్షణా శిబిరంలో Special Intensive Revision (SIR) ప్రక్రియ, ఎన్నికల సంఘం నిబంధనలు, ఓటరు జాబితా సవరణ విధానం, డిజిటల్ సేవల వినియోగం, బీఎల్ఏల బాధ్యతలపై విస్తృతంగా అవగాహన కల్పించారు.
ఓటర్ల జాబితా సవరణలో ప్రతి బీఎల్ఏ చురుకుగా పనిచేయాలి… బలమైన బూత్ వ్యవస్థతోనే కాంగ్రెస్ పార్టీ విజయ లక్ష్యాన్ని సాధిస్తుంది