PRANTIYA VAARTHA
Newspaper Banner
Date of Publish : 27 October 2026, 1:12 am Posted by : RAVINDHAR

ఎల్లారెడ్డి నియోజకవర్గానికి మంత్రి సీతక్క రాక

ప్రాంతీయ వార్త అక్టోబర్ 26

ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మంగళవారం, అక్టోబర్ 27న పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు పంచాయతీరాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి శ్రీమతి సీతక్క, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ హాజరుకానున్నారు.
నియోజకవర్గంలో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు విచ్చేస్తున్న మంత్రి సీతక్క, ఎమ్మెల్యే మదన్ మోహన్‌కు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం తరఫున స్వాగతం పలికారు. ఈ పర్యటనతో నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు మరింత ఊతం లభిస్తుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రజలకు అవసరమైన సౌకర్యాల కల్పనకు సంబంధించిన కార్యక్రమాలపై ఈ పర్యటనలో ప్రాధాన్యత ఉందీ